చిలకడదుంపల్ని కాల్చుకుని తింటేనే బెస్ట్... దురలవాట్లకు ఈ దుంపలతో చెక్
- February 19, 2017
పిల్లలు బరువు పెరగట్లేదా? అయితే చిలకడ దుంపల్ని పెట్టండి. చిలకడదుంపలను కాల్చుకుని, ఉడికించి, పచ్చివిగానూ తీసుకోవచ్చు. ఎలా తిన్నా చాలా రుచిగా ఉండే పోషకవిలువలు గల ఆహారం, ఈ దుంపల్ని పాతకాలం నాటి నిప్పులమీద కాల్చుకుని తింటేనే ఆరోగ్యకరం. చిలకడ దుంపల్లో పలు విటమిన్లు గల పిండిపదార్థాలు మాత్రమే గాక ప్రొటీన్లు, ఖనిజాలూ వీటిలో వున్నాయి. ఇవి శక్తినివ్వడమే పుష్టిని కల్గిస్తాయి.
బరువు పెరగాలనుకునేవారు వివిధ రకాల కృత్రిమ పదార్థాలు తీసుకోవడం బదులుగా చిలకడదుంపలు తినవచ్చు. పొగతాగడం, మద్యం సేవించడం, మత్తుపదార్థాలు తీసుకోవడం లాంటి దురలవాట్లు నుండి దూరం కావడానికి ఈ దుంపలు ఉపయోగపడతాయి. అంతేకాదు, ఆర్థరైటిస్, నరాలకు సంబంధించిన రుగ్మతల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అందుకే గుండె ఆరోగ్య పరిరక్షణలోనూ ఇవి మేలైనవి. బహుళ ప్రయోజనకారి. పుష్కలంగా ఫైబర్ పోషకాలు ఉన్నాయి. అందువల్ల వీటిని హాయిగా వాడుకోవచ్చు. అల్సర్‌ను దూరం చేస్తాయి.
బంగాళాదుంపలో కంటే చిలకడదుంపలో ఫైబర్ ఎక్కువ. రుచి కూడా ఎక్కువే. జీర్ణశక్తికి బాగా ఉపకరిస్తుంది. ఇందులోని పిండిపదార్థాలు జీర్ణక్రియకు దోహదం చేస్తాయి. ఆర్థరైటిస్‌ను అదుపులో ఉంచడంలో చిలకడదుంపలోని బీటాకెరోటిన్, మెగ్నీషియం, విటమిన్-బి కాంప్లెక్స్ తదితర విటమిన్లు ఎంతగానో దోహదం చేస్తాయి. ఆర్థరైటిస్ వల్ల కలిగేటువంటి నొప్పులు శమించ డానికి చిలకడదుంపలు ఉడికించిన నీటిని మర్దనా చేస్తే ఉపయోగం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
చిలకడ దుంప, విటమిన్ 'డీ'ని పుష్కలంగా కలిగి ఉండటమ వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, మానసిక కల్లోలాలను తగ్గించి, శక్తిని పెంచి, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండెకు మేలు చేస్తుంది. ఇందులోని బీటాకెరోటిన్ క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. కంటికి సంబంధించిన రోగాలను నయం చేస్తుంది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







