ఐడీ కార్డు పోయినట్లయితే ఫిర్యాదు తప్పనిసరి

- February 20, 2017 , by Maagulf
ఐడీ కార్డు పోయినట్లయితే ఫిర్యాదు తప్పనిసరి

రియాద్‌: పాస్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, రెసిడెంట్స్‌కి పాస్‌పోర్ట్‌ విషయమై స్పష్టమైన ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేసింది. పాస్‌పోర్టులు ముకీమ్‌ కార్డులు ఒకవేళ పోయినట్లయితే 24 గంటల్లోపు ఫిర్యాదు చేయాలనీ లేని పక్షంలో 1,000 సౌదీ రియాల్స్‌ నుంచి 3,000 సౌదీ రియాల్స్‌ వరకు జరీమానా తప్పదని పేర్కొన్నారు అధికారులు. నాన్‌ సౌదీస్‌ తమ ముకీమ్‌ కార్డుల్ని గడువు లోపల రెన్యువల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో ముందుగా పీజు చెల్లించి, మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ వెబ్‌సైట్‌లో రెన్యువల్‌ చేయించుకోవాలి. గడువు తీరిన ముకీమ్‌ కార్డుని కలిగి ఉంటే డిపార్ట్‌మెంట్‌ సర్వీసులు లభించవు, అలాగే 500 సౌదీ రియాల్స్‌ జరీమానా తప్పదు. ముకీమ్‌ కార్డు, రెసిడెన్సీ లైసెన్సుగా ఉపయోగపడ్తుంది. రెండేళ్ళ క్రితం దీన్ని అమల్లోకి తెచ్చారు. ఆన్‌లైన్‌ ద్వారా ఇది రెన్యువల్‌ చేసుకోవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com