అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన ఏపీ సిర్కారు
- February 23, 2017
దేశంలోనే మొట్ట మొదటిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సర్వీసులను ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రాంభించారు. 13జిల్లాలకు 19 అంబులెన్సులు ఏర్పాటు చేశామని మంత్రి కామినేని తెలిపారు. ఒక్కో అంబులెన్సులో రూ.32 లక్షల విలువైన వైద్య పరికరాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రతి 5 లక్షల జనాభాకు ఒక అంబులెన్సు ఏర్పాటు చేశామన్నారు. ఈ అంబులెన్సులలో టెలిమెడిసిన్ డాక్టర్ ద్వారా రోగికి ప్రత్యేక వైద్య సహయం అందించే సదుపాయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు మంత్రి వివరించారు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







