ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్
- February 23, 2017
రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తమ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.100కి 10 జీబీ వరకు అదనపు 3జీ, 4జీ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ప్లాన్ కు ఇది అదనపు డేటా. రూ.500 పైబడిన ప్లాన్ తో కొనసాగుతున్నవారు ప్రస్తుతం 3జీబీ డేటాను పొందుతుంటే, మరో రూ.100 అదనంగా చెల్లించి 10జీబీ వరకు అదనపు డేటా పొందొచ్చు. ఈ ఆఫర్ కొన్నివారాల పాటు ఎంపికచేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. 4జీ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి పోస్ట్ పెయిడ్ కస్టమర్ ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ 10జీబీ డేటా 28 రోజుల వరకు మాత్రమే వాలిడిటీ ఉంటుంది.
తాజా వార్తలు
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!







