మాండలిన్ శ్రీనివాస్ కు నివాళిగా దేవీ శ్రీ ఆల్బమ్
- February 28, 2017
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, తన గురువు మాండలిన్ శ్రీనివాస్ కు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. ఫిబ్రవరి 28న మాండలిన్ శ్రీనివాస్ జయంతి సందర్భంగా గురవే నమః పేరుతో ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఈ పాటకు దేవీ శ్రీ స్వయంగా కాన్సెప్ట్ డిజైన్ చేసి, సంగీతం అందించి ఆలపించాడు. ఈ పాట కేవలం ఏదో ఒక భాషకు పరిమితం కావొద్దన్న ఉద్దేశంతో సంస్కృతంలో రూపొందించాడు. గురువు, సంగీతాల గొప్పదనాన్ని వివరిస్తూ రూపొందించిన ఈ పాటకు జొన్నవిత్తుల సాహిత్యం అందించారు.
'గురువు గొప్పదనాన్ని మాటల్లో చెప్పలేం అందుకే నేను సంగీతంతో చెప్పే ప్రయత్నం చేశానన్నా'డు దేవీ శ్రీ. అంతేకాదు తన గురువు మాండలిన్ శ్రీనివాస్ కు నివాళిగా రూపొందించిన ఈ పాటను ఆయనకు ఎంతో ఇష్టమైన కీరవాణి రాగంలో రూపొందించినట్టుగా తెలిపారు.
వీడియో రూపంలో కూడా రిలీజ్ కానున్న ఈ ఆల్బమ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాండలిన్ శ్రీనివాస్ అభిమానులు సహాయ సహకారాలు అందించారు. వారందరికీ దేవీ శ్రీ కృతజ్ఞతలు తెలియజేశాడు.
లహరి మ్యూజిక్ ద్వారా మ్యూజిక్ ఆల్బమ్ ను రిలీజ్ చేయటంతో పాటు ప్రముఖ సంగీతకారులు ఉస్తాద్ అంజాద్ అలీఖాన్, డ్రమ్స్ శివమణి, మాండలిన్ యు రాజేష్ లతో కలిసి ద గ్రేట్ మాండలిన్ పేరుతో మ్యూజికల్ కన్సర్ట్ ను నిర్వహించనున్నారు. అతి చిన్న వయసులో దేవీ శ్రీ ప్రసాద్ కు మాండలిన్ ను పరిచయం చేసిన శ్రీనివాస్, దేవీ కూడా మాండలిన్ విద్వాంసుడిగా ఎదగాలని ఆశించారు. తరువాత సంగీత దర్శకుడిగా మారిన దేవీ శ్రీ పలు వేదిక మీద మాండలిన్ శ్రీనివాస్ పట్ల తన గురుభక్తిని చూపించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







