ఆంధ్రప్రదేశ్‌కు 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం
- February 28, 2017
ఆంధ్రప్రదేశ్‌కు 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం దక్కింది. సీఎన్‌బీసీ టీవీ18 అందించే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మక 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం లభించింది. బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాల జాతీయస్థాయి ప్రముఖుల జ్యూరీ ఈ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది. మార్చి 23న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన పురోగతిని పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కాగ, ఆంధ్రప్రదేశ్‌కు 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' అవార్డు రావడం పట్ల ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.అభివృద్ది, టెక్నాలజీ వినియోగం, సమర్థ నాయకత్వం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేసినట్లు భావిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







