పాదయాత్ర చేయనున్న బాలయ్య

- February 28, 2017 , by Maagulf
పాదయాత్ర చేయనున్న బాలయ్య

హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏప్రిల్‌లో పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. హిందూపురంలోని గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురం టౌన్ వరకు బాలకృష్ణ పాదయాత్ర చేస్తారని సమాచారం. హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ పీఏ శేఖర్ వ్యవహారంతో రచ్చరచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూపురం టీడీపీ ముఖ్య నేతలు హైదరాబాద్‌లో బాలకృష్ణతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చల అనంతరం బాలకృష్ణ తన పాదయాత్ర విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. సమస్యలపై అవగాహన కుదుర్చుకునే దిశాగ ఈ పాదయాత్ర ఉటుంది టాక్.

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఇటివలే 101వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలయ్య. పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఓ చిత్రం చేడానికి రంగం సిద్దం చేస్తున్నారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com