బాలీవుడ్ తార భాగ్యశ్రీ చిక్కుల్లో
- February 28, 2017
మైనే ప్యార్ కియా హీరోయిన్ భాగ్యశ్రీపై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడు
మహ్మద్ నౌసిఫ్ ఫిర్యాదుతో ముంబైలోని శాంతక్రజ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. గత సెప్టెంబర్‌లో ముంబైలోని లింక్ రోడ్డుపై నౌసిఫ్ బైక్‌ని స్కోడా కారు ఢీకొట్టింది. గాయపడిన నౌసీఫ్, ఆసుపత్రిలో చేరాడు. ఎడమ కాలికి గాయకావడంతో అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాడు.
ఈ విషయం తెలియగానే హాస్పటల్లోవున్న బాధితుడ్ని భాగ్యశ్రీ భర్త హిమాలయ దసానీ పరామర్శించి, చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని చెప్పి ఆ తర్వాత మాటమార్చాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై భాగ్యశ్రీ భర్త హిమాలయ్ స్పందించాడు. నౌసీఫ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, తమ నుండి అదనపు మనీ రాబట్టడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు.
ఈ నేపథ్యంలో బాధితుడిపై బ్లాక్ మెయిల్ కేసు నమోదు చేయడానికి భాగ్యశ్రీ, ఆమె భర్త తమ లాయర్ ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









