2012, 2013 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది
- March 01, 2017
2012, 2013 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కొంత కాలంగా నంది అవార్డులను తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఇస్తుందన్న సస్పెన్స్ కు తెర పడింది . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో కొత్త అవార్డులను ఇస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2012, 2013 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ప్రకటించింది.
2012 సంవత్సరానికి ప్రకటించిన అవార్డుల్లో ఈగ, ఎటోవెళ్లిపోయింది మనసు, మిథునం సినిమాలు పోటి పడ్డాయి. ఈగ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులతో కలిపి ఆరు అవార్డులను సొంతం చేసుకోగా, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాకు నాలుగు అవార్డులు దక్కాయి.
మిథునంకు రెండు, మిణుగురులుకు రెండు అవార్డులు దక్కాయి. ఎస్వీ రంగారావు పురస్కారానికి గాను ఆశిష్ విద్యార్థిని ఎంపిక చేశారు. సీనియర్ నటి జయసుథ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఎంట్రీ లను పరిశీలించి విజేతలను నిర్ణయించింది.
2012 నంది అవార్డుల వివరాలు :
ఉత్తమ చిత్రం : ఈగ
ద్వితీయ ఉత్తమ చిత్రం : మిణుగురులు
తృతీయ ఉత్తమ చిత్రం : మిథునం
ఉత్తమ దర్శకుడు : రాజమౌళి ( ఈగ )
ఉత్తమ నటుడు : నాని (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ నటి : సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ విలన్ : సుదీప్ (ఈగ)
ఉత్తమ మాటల రచయిత : తనికెళ్ల భరణి (మిథునం)
ఉత్తమ గేయ రచయిత : అనంత్ శ్రీరామ్ (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ సంగీత దర్శకుడు : కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
ఉత్తమ ఫైట్స్ : గణేష్ ( ఒక్కడినే)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ : ఆర్ సీ యం రాజు (మిణుగురులు)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీమేల్ : శిల్ప (వీరంగం)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : ఈగ
ఎస్వీ రంగారావు పురస్కారం ఆశిష్ విద్యార్థి
2013 సంవత్సరానికి గాను మిర్చి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలకు అవార్డుల పంట పండింది.
ఉత్తమ చిత్రం : మిర్చి
రెండో ఉత్తమ చిత్రం : నా బంగారు తల్లి
మూడో ఉత్తమ చిత్రం : ఉయ్యాల జంపాల
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం : అత్తారింటికి దారేది
ఉత్తమ హీరో : ప్రభాస్ (మిర్చి)
ఉత్తమ హీరోయిన్ : అంజలి (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
ఉత్తమ దర్శకుడు : దయా కొడవటిగంటి (అలియాస్ జానకి)
ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







