నిరుద్యోగులను మోసం చేసే ముఠా అరెస్ట్
- March 01, 2017
హైదరాబాద్ : నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తులను హైదరాబాదులోని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ గోనె సందీప్‌రావు వివరాలు వెల్లడించారు. మల్లాపూర్‌కు చెందిన నెమలి కుమార్(25), మౌలాలి జవహర్‌నగర్‌కు చెందిన లింగాల సుమిత్(26) అద్విత సేవా ఫౌండేషన్ పేరుతో మెగా ఉద్యోగ మేళా ను ఫిబ్రవరి 26న ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాలలో నిర్వహించారు.
ఈ మేరకు నిరుద్యోగుల నుంచి రూ.200 రిజిస్ట్రేషన్ చార్జీ వసూలు చేశారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు వచ్చారు. అయితే ప్రముఖ కంపెనీలు రాకపోవడం, సెక్యూరిటీగార్డులు, ఎల్‌ఐసీ ఏజెంట్ల వంటి ఉద్యోగాలు ఉండటంతో ఆగ్రహించిన నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. అనుమతులు లేకపోవడం, మోసం చేయడం, వారి నుంచి డబ్బులు వసూలు చేయడంపై పోలీసులు కేసు నమోదు చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







