పెప్సీ, కోక్‌లను బహిష్కరించిన తమిళనాడు ప్రభుత్వం

- March 01, 2017 , by Maagulf
పెప్సీ, కోక్‌లను బహిష్కరించిన తమిళనాడు ప్రభుత్వం

స్థానిక తయారీదారులను ప్రోత్సహించాలని పెప్సీ, కోక్ కంపెనీలను బహిష్కరిస్తున్నట్లు తమిళ వ్యాపారులు వెల్లడించారు.  దీంతో పెప్సీ, కోక్‌లకు రూ.1400 కోట్ల మేర నష్టం వాటిల్లనుంది.  రాష్ట్రంలోని అతి పెద్ద వాణిజ్య సంఘం తమిళనాడు వానిగర్ సంగమ్ పెప్సీ, కోక్‌లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.  ఈ సంఘంలో ఆరు వేలకు పైగా చిన్న మధ్య తరహా దుకాణాలు, 15 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు.  చిన్న చిన్న షాపుల్లోనూ ఇక నుంచి ఈ  డ్రింక్స్ అమ్మబోరని  సంఘం స్పష్టం చేసింది.  పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు కొంత సమయం కావాలని అడిగినా, తాము అంగీకరించలేదని సంఘం వెల్లడించింది.  గత జనవరి నెలలో జల్లికట్టు కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా వాణిజ్య సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తమిళులకు ఉన్న పట్టుదల మన తెలుగువారిక్కూడ వుంటే ఎంతబావుణ్ణు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com