నిర్లక్ష్యంగా వైద్యం చేసి బాలిక మరణంకు కారకులైన ఇరువురు వైద్యురాళ్లకు జైలు శిక్ష

- March 01, 2017 , by Maagulf
నిర్లక్ష్యంగా వైద్యం చేసి  బాలిక మరణంకు కారకులైన ఇరువురు వైద్యురాళ్లకు  జైలు శిక్ష

 వైద్యో నారాయణ అని విన్నాం..దేవుడి తర్వాత రోగాల బారిన పడినవారిని తమ వైద్యంతో సంరక్షించే డాక్టర్లు ఎందరికో పునర్జన్మని ప్రసాదిస్తుంటారు..అటువంటి వైద్యులు బౌతికంగా చనిపోయినప్పటకీ..జన హృదయాలలో చిరంజీవులుగా నిలిచిపోతారు. కానీ అటువంటి పవిత్ర వృత్తి లోను అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ కొందరు వైద్యులు యావత్ వైద్య వృత్తినే అపవిత్రపరుస్తున్నారు. అయితే గల్ఫ్ దేశాలలో వైద్యులూ చట్టాలకు ఏమీ మినహాయింపు కాదని రుజువు కాబడింది. ఒక 12 ఏళ్ల బాలికకు నిర్లక్ష్యంగా వైద్యం చేసి ఆ పాప మరణానికి కారకులైన ఇరువురు మహిళా వైద్యురాళ్లకు ప్రత్యేక అధికార కోర్ట్ మూడు సంవత్సరాలు కారాగార శిక్ష రద్దు చేశారు. అయితే,  ఒకొక్కరికి ఆరు నెలల జైలుశిక్ష న్యాయస్థానం విధించింది. వివరాలలోకి వెళితే, వైద్యం వికటించిన ఫలితంగా ఫాతిమా ఆలీ ఘులూమ్ (12 )  బాలిక మొత్తం బ్రెయిన్ డేమేజ్ కాబడిన ఫలితంగా సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద  చనిపోయింది. న్యాయస్థానంకు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలికకు అండాశయాలలో అనేక బుడిపెలు ఉన్నట్లు వ్యాధి నిర్ధారణ జరిగింది. ఇందుకు ఆ అమ్మాయికు ఆపరేషన్ సైతం చేయాలని నిర్ణయించారు  శిక్షణలో ఉన్న మొదటి వైద్యురాలు తన మిడి మిడి జ్ఞానంతో ఆ బాలికకు ఆమె అన్నవాహిక ( ఈసోఫాగ్ ) లోనికి పంపించాల్సిన మత్తు (అనస్థీషియ) ట్యూబ్ ని  శ్వాస నాళంకు అనుసంధానించింది, ఈ తప్పుతో ఆ బాలిక  మెదడు నాశనం కాబడింది.శస్ర్త చికిత్స చేసే థియేటర్ గదిలో మొదటి ప్రతివాది వైద్యురాలిని పర్యవేక్షణ చేయాల్సిన రెండవ ప్రతివాది వైద్యురాలు..అంతంత మాత్రమే  వైద్య పరిజ్ఞానంతో ఇంకా శిక్షణ పొందుతున్న వైద్యురాలికి ఆ బాలికని ఒంటరిగా అప్పచెప్పి సీనియర్ వైద్యురాలు వెలుపలకు వెళ్ళింది. ట్రైనీ వైద్యురాలి అజ్ఞానం ఫలితంగా ఫాతిమా ఆలీ ఘులూమ్ (12 ) రెండు వారాలపాటు కోమా లోనికి వెళ్ళి మృత్యువుతో పోరాడి చివరకు చనిపోయింది. ఆ బాలిక తల్లిదండ్రులు తమ బిడ్డ పట్ల ఆ వైద్యరాళ్లు చూపిన నిర్లక్ష్యానికి ఆగ్రహించి వారిపై కోర్టులో దావా వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com