ఇండోనేషియా చేరుకున్న సౌదీ రాజు సల్మాన్
- March 01, 2017
వెయ్యిమంది పరివారం.. మెర్సిడెస్ లిమోజిన్లు సహా 406 టన్నుల సరంజామాతో సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఇండోనేషియాలో కాలుమోపారు. జకార్తాలో 81 ఏళ్ల సల్మాన్ విమానం నుంచి ఎస్కులేటర్లో దిగారు. 47 ఏళ్లలో సౌదీ రాజు ఇండోనేషియాలో పర్యటించడం ఇదే తొలిసారి. సౌదీ మోనార్క్ రాక సందర్భంగా బొగొర్ ప్యాలస్లోని దిగంబర విగ్రహాలను వస్త్రాలతో కప్పారు. ఆయన ఓ మసీదును సందర్శించనున్న సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా వీఐపీ టాయ్లెట్ నిర్మించారు. 150 మంది వంటవాళ్లను నియమించారు. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా పేరుగాంచిన ఇండోనేషియాతో ఆర్థిక సంబంధాల మెరుగు కోసం సల్మాన్ పర్యటిస్తున్నారు. జకార్తాలో సమావేశాల అనంతరం ఆయన బాలిలో కొన్ని రోజులు విడిది చేస్తారు. అక్కడ అయిదు లగ్జరీ హోటళ్లు సిద్ధం చేశారు. విమానాల్లో తరలించిన టన్నులకొద్దీ సామగ్రి ఇప్పటికే బాలి తరలించారు. సౌదీ రాజు జపాన్, చైనా, మాల్దీవుల్లో కూడా పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







