కాబూలీ శనగల పాలక్ చోళీ
- March 01, 2017
కావలసిన పదార్థాలు: (ఉడికించిన) కాబూలీ శనగలు - 2 కప్పులు, పాలకూర తరుగు - 2 కప్పులు, బటర్ - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లి తరుగు - 1 కప్పు, వెల్లుల్లి - 3 రేకలు, అల్లం తురుము - 1 టేబుల్ స్పూను, చోళే మసాల పొడి (మార్కెట్లో దొరుకుతుంది) - 1 టేబుల్ స్పూను, టమోటా - 1, బిర్యానీ ఆకులు - 2, మిరియాలపొడి - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, గరం మసాలా - 1 టీ స్పూను, క్రీమ్ - పావు కప్పు.
తయారుచేసే విధానం: అరకప్పు నీటిలో పాలకూర 3 నిమిషాలు ఉడికించి పక్కనుంచాలి. బటర్లో ఉల్లి, అల్లం, వెల్లుల్లి తరుగు వేగించి, చోళే మసాల, టమోటాలు, బిర్యాని ఆకులు, మిరియాలపొడి, ఉప్పు కలపాలి. టమోటాలు మెత్తబడ్డాక పాలకూర, శనగలు వేసి అరకప్పు నీరు, గరం మసాల వేసి (మూత పెట్టకుండా) 5 నిమిషాలు చిన్నమంటపై ఉడికించాలి. దించేముందు క్రీమ్ వేయాలి. వేడి వేడి అన్నం, పరాటాలతో తింటే మంచి కాంబినేషన్.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









