ఖతార్‌లో ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌

- March 02, 2017 , by Maagulf
ఖతార్‌లో ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌

ఖతార్‌లో 2017 ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌కి రంగం సిద్ధమవుతోంది. మార్చ్‌ 29న ఈ ఫెస్టివల్‌ ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌ 8 వరకు ఈ ఫెస్టివల్‌ కొనసాగుతుంది. మ్యూజియం ఆఫ్‌ ఇస్లామిక్‌ ఆర్ట్స్‌ పార్క్‌, కటారా కల్చరల్‌ విలేజ్‌, పెరల్‌ ఖతార్‌లలో ఈ ఫెస్టివల్‌ని ప్రారంభించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన సంప్రదాయ వంటకాలు, గల్ఫ్‌ దేశాల్లోని సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే వంటకాలు ఆహూతులకు పసందైన రుచుల్ని అందించనున్నాయి. ఫుడ్‌ ఫెస్టివల్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చుతామని నిర్వాహకులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ చెఫ్‌లు ఈ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణ కానున్నారు. అద్భుతమైన వంటకాలతో ఆహూతుల మన్ననల్ని అందుకోనున్నారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com