భారత సైన్యానికి ఆహారంగా పాములు, తేళ్ళు

- March 03, 2017 , by Maagulf
భారత సైన్యానికి ఆహారంగా పాములు, తేళ్ళు

ఎటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికైనా భారత సైనికాధికారులు ముందుంటారు. ప్రపంచంలోని ఏ దేశా సైన్యానికి తీసిపోని విధంగా మన సైనికులు ధైర్యసాహసాలు ప్రదర్శిస్తుంటారు. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం మన సైనికుల సొంతం.  అయితే అత్యంత కఠిన పరిస్థితుల మధ్య యుద్ధం చేయాల్సి వస్తే తినడానికి తిండి లేని పక్షంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయంలో భాగంగా భారత జవాన్లకు కఠోర శిక్షణను ఇస్తున్నారు.  ఇందులో భాగంగా పాములు, తేళ్ళు, వివిధ రకాల కీటకాలను తినేలా శిక్షణ ఇస్తున్నారు.  మిజోరంలోని జంగిల్ వార్ ఫేర్ స్కూళ్ళో ఈ తరహా శిక్షణను సైన్యానికి ఇస్తుంది.  ఉగ్రవాదులతో పోరాడే సమయంలో రోజుల తరబడి జనావాసాలకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి శిక్షణ ఉపయోగపడుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com