పేద ప్రజలకు ఉచితంగా 20 లక్షల ఇంటర్నెట్ కనెక్షన్లు

- March 03, 2017 , by Maagulf
పేద ప్రజలకు ఉచితంగా 20 లక్షల ఇంటర్నెట్ కనెక్షన్లు

త్రివేండ్రం: పేద ప్రజలకు ఉచితంగా 20 లక్షల ఇంటర్నెట్ కనెక్షన్లను కల్పించనున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో 2017-08 వార్షిక బడ్జెన్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.

ఇంటర్నెట్ అన్నది ఇప్పుడు ప్రజల హక్కుగా మారిందని, 18 నెలల లోపు కే ఫోన్ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్ గేట్ వేను సమకూరుస్తామని ఐజాక్ చెప్పారు. ఇందుకోసం 1000 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. 20 లక్షల మందికి ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని, మిగిలిన వారికి తక్కువ ధరకు అందిస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com