ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిస్తే ఔటే!
- March 04, 2017
వాషింగ్టన్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిచ్చే కంపెనీలను నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా కాంగ్రెస్ లో మరోసారి ప్రవేశపెట్టారు. భారత్ వంటి దేశాలకు ఉద్యోగాల బదిలీ కొనసాగకుండా చూడటమే ఈ ద్వైపాక్షిక బిల్లు ముఖ్య ఉద్దేశం.
అధికార రిపబ్లికన్ సభ్యుడు డేవిడ్ మెకిన్లే, ప్రతిపక్ష డెమొక్రటిక్ సభ్యుడు జీన్ గ్రీన్ ప్రతిపాదనల ప్రకారం అమెరికా వెలుపల కాల్ సెంటర్లు నిర్వహించుకునే కంపెనీలకు గ్రాంట్లు లభించవు. ప్రభుత్వం నుంచి రుణాలు కూడా అందవు.
ఈ బిల్లు ప్రకారం ఉద్యోగాలను తరలించే సంస్థలను బ్యాడ్ యాక్టర్స్ జాబితాలో చేరుస్తారు. విదేశీ కాల్ సెంటర్లు తాము ఎక్కడినుంచి మాట్లాడుతున్నామో వినియోగదారులకు వెల్లడించాల్సి ఉంటుంది.
అమెరికా వినియోగదారులు కోరినప్పుడు వారికి అమెరికాలోనే ఉండే సర్వీస్ ఏజెంట్ నుంచి సేవలను అందించాల్సి ఉంటుంది.
2013లో కూడా ఇదే తరహా బిల్లును ప్రవేశపెట్టారు. ఒక్క గ్రేగ్ హూస్టన్ ప్రాంతంలోనే 54 వేల కాల్ సెంటర్ ఉద్యోగాలు ఉన్నాయని, దేశ వ్యాప్తంగా 25 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని గ్రీన్ పేర్కన్నారు.
దురదృష్టవశాత్తు కాల్ సెంటర్ ఉద్యోగాలు ఇక్కడి నుంచి భారత్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు తరలిపోతున్నాయని, ఈ ద్వైపాక్షిక బిల్లు ద్వారా అమెరికన్లకు ఉద్యోగ భద్రత ఉండడంతోపాటు ఇక్కడి వినియోగదారులు అనుచితమైన ప్రవర్తను నుంచి ఉపశమనం పొందుతారని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు అమెరికా ఎన్నికల సందర్భంగా రష్యన్లతో నెరిపిన సంబంధాలపై చేపట్టే దర్యాప్తులో తాను జోక్యం చేసుకోనని, ఆ కేసుల నుంచి తాను తప్పుకుంటున్నానని అమెరికా అటర్నీ జనరల్ జెఫ్ షెషన్స్ ప్రకటించారు.
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









