ఐర్లాండ్ వెళ్ళిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

- September 23, 2015 , by Maagulf
ఐర్లాండ్ వెళ్ళిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐర్లాండ్ చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో మోదీ బృందం ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ చేరుకుంది. 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఐర్లాండ్ లో పర్యటిస్తున్న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆ దేశ ప్రభుత్వాధినేత (తెషెక్) ఎన్డా కెన్నీతో మోదీ సమావేశమవుతారు. ఐర్లాండ్ లోని భారత సంతతి ప్రజలతో మోదీ కొద్దిసేపు సమావేశమవుతారు. ఈ రోజు సాయంత్రం మోదీ అక్కడి నుంచి న్యూయార్క్ బయల్దేరి వెళతారు. అమెరికా పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధాని ప్రసంగిస్తారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆతిథ్యమిస్తున్న శాంతిపరిరక్షణపై ఐరాస సదస్సులో పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com