రవాణా సమయంలో గుండెపోటుతో మృతి చెందిన వలస భారతీయుడు
- March 06, 2017
సౌదీ అరేబియాలో ఒక నిర్వాసిత భారతీయుడు రవాణా సమయంలో బహరేన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుండెపోటుతో మరణించాడు. గత శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో గురుసామి మూక్కన్, 49 సంవత్సరాల వయస్సు వ్యక్తికి హఠాత్తుగా గుండె ఆగిపోవడంతో మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.స్థానిక సామాజిక కార్యకర్త బషీర్ అంబాలాయి తెలిపిన సమాచారం మేరకు గురుసామి మూక్కన్ సౌదీ వీసా పునరుద్ధరించిన తరువాత రియాద్ నుండి గల్ఫ్ ఎయిర్ విమానం జి ఎఫ్ 068 ద్వారా భారతదేశం వెళ్లేందుకు ప్రయాణించే తన మార్గంలో ఈ మరణం సంభవించింది. భారతదేశం తమిళనాడు రాష్ట్రంలోని కొక్కడి గ్రామంకు చెందిన గురుస్వామి శుక్రవారం తన ప్రయాణ సమయంలో భాగంగా విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ చేయించుతున్నప్పుడు తనకు ఛాతీ నొప్పి వచ్చినట్లు భావించాడు. దీనితో ఆయనను మూహ్యాయరాక్ లో కింగ్ హేమాడ్ విశ్వవిద్యాలయం హాస్పిటల్ కు తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచారు.ఈ వ్యక్తి చనిపోయిన వార్త భారత రాయబార కార్యాలయంలో నమోదు అయ్యింది. లాంఛన కార్యక్రమాలు పూర్తయ్యాయి భౌతిక కాయాన్ని భారతదేశంకు తరలింపుబడుతుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







