'వరల్డ్‌ ఆఫ్‌ విమెన్‌ ఫిలిం ఫెయిర్‌' అవార్డులు

- March 06, 2017 , by Maagulf

దుబాయ్‌:వరల్డ్‌ ఆఫ్‌ విమెన్‌ ఫిలిం ఫెయిర్‌ మిడిల్‌ ఈస్ట్‌ ఛారిటీ గలా డిన్నర్‌ మరియు అవార్డ్స్‌ సెర్మనీ రేపు రాత్రి పార్క్‌ హయాత్‌ దుబాయ్‌లో జరగనుంది. ఈ వేడుకలకు మినిస్టర్‌ ఆఫ్‌ కల్చర్‌ అండ్‌ నాలెడ్జ్‌ డెవలప్‌మెంట్‌ షేక్‌ నహ్యాన్‌ ముబారక్‌ అల్‌ నహ్యాన్‌ హాజరు కానున్నారు. ఫిలిం అవార్డ్స్‌తోపాటుగా, వివిధ రంగాల్లో అత్యున్నతమైన ప్రతిభను చూపినవారికి ఈ సందర్భంగా అవార్డుల్ని ప్రదానం చేస్తారాయన. హుమానిటేరియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌, బిజినెస్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌, పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌, స్పోర్ట్స్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌, రైజింగ్‌ టాలెంట్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులు ఇందులో ముఖ్యమైనవి. మార్చ్‌ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఇంకో వైపున ఆరు రోజులపాటు 31 సినిమాల్ని (మహిళా ప్రముఖులు రూపొందించినవి) ప్రదర్శిస్తున్నారు విఓఎక్స్‌ సినిమాస్‌ - నేషన్‌ టవర్స్‌, అబుదాబీలో. 24 దేశాలకు చెందిన ప్రముఖులు, ఐదు అంశాల్లో ఈ సినిమాల్ని రూపొందించడం జరిగింది. వావ్‌ నెలవారీ మెంబర్‌షిప్‌ ద్వారా ఈ ఫెయిర్‌ని, అలాగే ఈ వెంట్‌ మొత్తాన్నీ సపోర్ట్‌ చేసేందుకు అవకాశం ఉంది. మెంబర్‌ షిప్‌, మరియు టిక్కెట్స్‌ బుక్‌ చేసుకోవడానికి విఓఎక్స్‌ సినిమా, వావ్‌ మిడిల్‌ ఈజ్ట్‌ వెబ్‌సైట్‌ని సంప్రదించవచ్చు. 

 

 

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com