యాంగ్రీ హీరో రాజశేఖర్ హీరోగా సన్నీలియోన్ తో సినిమా
- March 07, 2017
చాలా కాలంగా వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్న యాంగ్రీ హీరో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గరుడ వేగ. గుంటూరు టాకీస్ తో మంచి విజయం సాధించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. రాజశేఖర్ మరోసారి యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పూజా కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఎక్కువగా భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు చిత్రయూనిట్. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్ ను బాలీవుడ్ హాట్ బ్యూటి సన్నీలియోన్ తో చేయిస్తున్నారు. భారీ మొత్తం ఆఫర్ చేయటంతో సన్నీ కూడా వెంటనే ఒప్పేసుకుందన్న టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చేసిన సన్నీ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఊర్రూతలూగించేందుకు రెడీ అవుతోంది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







