షాక్ ఇస్తున్న చిచ్చిర పిడుగు మహేష్ అభిమానులకు
- March 07, 2017
ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఇప్పటివరకు గౌతమ్ ఫోటోలు చూస్తే చాలు మురిసిపోతు మహేష్ వారసుడు వచ్చేసాడు అంటూ తెగ హంగామా చేసావారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది మహేష్ అభిమానుల దృష్టిలో మహేష్ మేనల్లుడు మంచి క్రేజ్ తెచ్చుకుని అప్పుడే మహేష్ వారసుడుగా మారిపోవడం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
'భలే భలే మగాడివోయ్' సినిమా చూసిన వాళ్లకు చిన్నప్పటి నానిగా కనిపించిన ఈ మహేష్ మేనల్లుడు చరిత్ గుర్తుండే ఉంటాడు. ఆ పాత్రలో ఆ కుర్రాడి నటన హావభావాలు బాగా ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా 'విన్నర్' సినిమాలో చిన్నప్పటి సాయి ధరమ్ తేజ్ గా కనిపించడమే కాకుండా గుర్రాల మధ్య చాల ధైర్యంగా పరుగులు తీస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.
మహేష్ సోదరి కుమారుడు హీరో సుధీర్ బాబు తనయుడు అయిన చరిత్ రాబోయే రోజులలో మహేష్ లా సూపర్ స్టార్ అవుతాడా అంటూ అప్పుడే కామెంట్స్ మొదలైపోయాయి. సుధీర్ బాబు హీరో కాకముందు జిమ్నాస్టే కాకుండా బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. ఇప్పుడు చరిత్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ జిమ్నాస్టిక్స్ లో తన సత్తాను చాటుతున్నాడు.
ఈమధ్య హైదరాబాద్ లో జరిగిన జిమ్నాస్టిక్స్ పోటీల్లో చరిత్ అద్భుత విన్యాసాలు ప్రదర్శిస్తున్న వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు సుధీర్. ఆ విన్యాసాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. దీనితో ఇప్పటివరకు తెలుగు తెరను ఏలుతున్న సూపర్ స్టార్ కుటుంబం నుంచి ఒక మంచి స్పోర్ట్స్ మన్ వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనిపిస్తోంది.
ఈ బుడ్డోడి జిమ్నాస్టిక్స్ విన్యాసాలు చూస్తే మంచి శిక్షణ ఇస్తే జాతీయ - అంతర్జాతీయ స్థాయికి ఎదిగే ప్రతిభ ఉన్నట్లే కనిపిస్తోంది. ఏమైనా ప్రస్తుతం మహేష్ అభిమానుల మధ్య చరిత్ హాట్ టాపిక్ గా మారాడు. దీనితో మహేష్ అభిమానులు అంతా మహేష్ మేనల్లుడి అభిమానులుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి..
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







