సందడి చేసిన చిరంజీవి మహేష్ సినిమా సెట్స్ లో

- March 07, 2017 , by Maagulf
సందడి చేసిన చిరంజీవి మహేష్ సినిమా సెట్స్ లో

మెగా స్టార్ చిరంజీవి త్కనకు నచ్చిన సినిమాలను.. అందులో మంచి నటన కనబరిచిన నటీనటులను ఎటువంటి భేషజం లేకుండా అభినందిస్తుంటారు అన్న సంగతి విధితమే.. కాగా తాజాగా చిరంజీవి బుల్లి తెర షో మీలో ఎవరు కోటీశ్వరుడు షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో జరుగుతోంది. కాగా అన్నపూర్ణ స్టూడియో లో మహేష్ బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కూడా జరుపుకొంటున్నది. ఈ సినిమాలోని మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ ని షూటింగ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ స్పెషల్ గెస్ట్ విచ్చేశారు.. ఆయన ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి.. మీలో ఎవరు కోటీశ్వరుడు షో షూటింగ్ జరుగుతున్నదని తెలిసి మహేష్ చిరంజీవిని సెట్స్ మీదకు ఆహ్వానించారట... దీంతో చిరంజీవి మహేష్ సినిమా షూటింగ్ కు వెళ్ళి ఆ బృందంతో కాసేపు గడపదమే కాదు.. మహేష్ స్టెప్స్ ను అభినందిస్తూనే కొన్ని సూచనలు కూడా చేశారట.. చిరు మహేష్ మురుగదాస్ ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా మహేష్ ఫ్యామిలీకి రామ్ చరణ్ ఫ్యామిలీకి మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి విధితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com