వీసా స్టేటస్ మార్పులకు కార్మికులు సానుకూలం
- September 23, 2015
విదేశీ కార్మికులు తమ వీసా స్టేటస్ మార్పుల కోసం సానుకూలంగా స్పందిస్తున్నారు. 232 మంది కార్మికులు వీసా స్టేటస్ మార్పుల కోసం ఇప్పటికే అంగీకారం తెలిపారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ప్రైవేట్ రంగలో పనిచేస్తున్న విదేశీ కార్మికుల వీసా స్టేటస్‌లో మార్పులకు శ్రీకారం చుట్టింది. రెండు విభాగాలుగా వీసా స్టేటస్‌లో మార్పులు చేయబడ్తాయి. శాశ్వతంగా తాము పనిచేస్తున్న దేశం నుంచి బయటకు వెళ్ళాలనుకునేవారి కోసం మొదటిది, రెండవది తాము చేస్తున్న ఉద్యోగాన్ని మాత్రమే వదలాలనుకునేవారి కోసం వీసాలో మార్పులు చేయబడేది. 360 మంది కార్మికులు సెప్టెంబర్ 13 నుంచి 19 మధ్య కాలంలో నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలింది. ఇలా అరెస్ట్ అయినవారిలో 284 మంది కమర్షియల్ కార్మికులు కాగా, 40 మంది రైతులు, 36 మంది సేవకులు వున్నారు. వీరిలో 138 మంది అనుమతి లేకుండా తాము చేస్తున్న పనిని వీడారు. 202 మంది తొలగింపబడ్డారు. 15 మంది కూలీల గురించి ఆయా సంస్థలు ఫిర్యాదు చేశాయి.అల్ దఖిలియా గవర్నరేట్ 119 మంది అరెస్ట్‌ను ధృవీకరించింది. నార్త్ అల్ బతినా గవర్నరేట్ 94 మందిని అరెస్ట్ చేసింది. నిబంధనల్ని అతిక్రమించిన 205 మందిని దేశం నుంచి బహిష్కరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







