ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్‌కి రంగం సిద్ధం
- March 07, 2017
ఐదు రోజులపాటు జరిగే ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్‌కి రంగం సిద్ధమయ్యింది. గ్రాండ్ హయాత్ మస్కట్‌లో మార్చ్ 15 నుంచి ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఒమన్‌లో ఇండియా అంబాసిడర్ ఇంద్రా మణి పాండే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇండియన్ ఎంబసీ - భారత మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తోంది. వెస్ట్ బెంగాల్, జమ్మూ అండ్ కాశ్మీర్, గుజరాత్, రాజస్తాన్ మరియు గోవా తదితర రాష్ట్రాలనుంచి అంతగా ప్రాచుర్యం లేని ప్రత్యేక ఆహార పదార్థాల్ని ఇక్కడ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నామని పాండే తెలిపారు. అలాగే మిగతా రాష్ట్రాల్లోని ప్రత్యేక వంటకాలకు లోటు ఏమీ ఉండదనీ, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆహార పదార్థాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. మెనూ చాలా కొత్తగా ఉంటుందనీ, ఎవరూ ఊహించని విధంగా ఏర్పాటు చేసే మెనూ అందరికీ నచ్చుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కోఆపరేషన్ ద్వారా ఇద్దరు చెఫ్‌లను ఎంపిక చేశారు. వారిద్దరూ ఈ ఫెస్టివల్లో పాల్గొంటారు. గ్రాండ్ హయాత్ చెఫ్స్తో కలిసి వారు పనిచేస్తారు.
తాజా వార్తలు
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!
- జీసీసీ-ఈయూ మధ్య భాగస్వామ్యం బలోపేతం..!!
- బంగారం ధరలు రికార్డ్-హై..!!
- బెలారస్ –ఒమన్ మధ్య పలు ఒప్పందాలు..!!
- మేధోమథనంతో మరింత మెరుగైన సేవలు: సీఎం చంద్రబాబు
- మరో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు..
- ట్రక్కుల పై 25 శాతం టారీఫ్‌లు విధించిన ట్రంప్