హ్యాకర్లకు మైక్రోసాఫ్ట్ సవాల్
- March 07, 2017
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బగ్ బౌంటీలకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. పరిమిత కాలానికిగాను బగ్ బంటీ ఆపరేషన్స్ వ్యయాన్ని దాదాపు రెట్టింపు చేసింది. 'బగ్ పట్టు రూ.10 లక్షలు పట్టు..' అంటూ హ్యాకర్లకు ఓపెన్ చాలెంజ్ విసిరింది.
తమ సేవల్లో లోపాలను పసిగట్టిన వారికి మైక్రోసాఫ్ట్ నగదు బహుమతిని ఆఫర్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తమ ఆన్ లైన్ సేవల్లో తీవ్రమైన దాడులను, సెక్యూరిటీ లోపాలను గుర్తించిన హ్యాకర్లకు మొత్తం దాదాపు 20 లక్షలు (30 వేల డాలర్లు) వరకు చెల్లించనుంది.
వీటినలో కనీసం 500 డాలర్లుగాను, గరిష్టంగా 15 వేల డాలర్లు(రూ.10 లక్షలు) నజరానా చెల్లిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
ఇలా సమర్పించిన వాటిలో అర్హులైన వారికి కనీసం 500 డాలర్ల నుంచి 15 వేల డాలర్ల వరకు అందించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 పోర్టల్, మైక్రోసాఫ్ట్ ఎక్స్ చేంజ్ ఆన్ లైన్ కు సంబంధించి మార్చి1 - మే 1 మధ్య కాలంలో సమర్పించిన అర్హులైన హ్యాకర్లు డబుల్ బొనాంజాకు అర్హులవుతారని తెలిపింది.
ఇలా అందిన అర్హమైన బగ్ రిపోర్టులకు సుమారు 30 వేల డాలర్ల వరకు అందించనున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దీనిపై మైక్రోసాఫ్ట్ నిర్ణయమే అంతిమమని, దాడి ప్రభావం ఆధారంగా ఈ చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







