నేత్రదానం చేసిన కపిల్ శర్మ

- March 07, 2017 , by Maagulf
నేత్రదానం చేసిన కపిల్ శర్మ

బాలీవుడ్ టాప్ కమెడియన్ కపిల్ శర్మ స్ఫూర్తి దాయకంగా నిలిచాడు. మరణానంతరం తన కళ్లను దానం చేస్తానని ప్రతిఙ్ఞ చేశాడు. గత నెలలో అంధుల టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై టీమిండియా విజయం సాధించింది. కపిల్ శర్మ షో లో ఈ జట్టు తాజాగా పాల్గొంది. ఈ నేపథ్యంలోనే కపిల్ శర్మ పై ఈ నిర్ణయం తీసుకున్నాడు.
"మనం చేసే ఒక చిన్న పని కూడా ఎవరికో ఒకరికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. నా కళ్ల ద్వారా ఎవరు ఒకరు లోకాన్ని చూడగలరు అనుకుంటే.. నేను ఎంతో సంతోషంగా అందుకు ఒప్పుకుంటాను' ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు కపిల్. కామెడి నైట్స్ విత్ కపిల్ షో కపిల్ శర్మ దేశవ్యాప్తంగ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇటివల హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చి ఓ హిట్ కొట్టాడు కపిల్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com