సౌదీ అరేబియా రాజుపై హత్యకు కుట్ర
- March 08, 2017
సౌదీ అరేబియా రాజు హత్యకు కుట్ర జరిగినట్లు మలేసియా పోలీసులు తెలిపారు. గత వారం కింగ్ సల్మాన్ కౌలాలంపూర్‌లో పర్యటించారు. ఈ సమయంలో సల్మాన్‌ను హత్య చేసేందుకు మిలిటెంట్లు కుట్ర పన్నినట్లు చెప్పారు. మొత్తం నలుగురు మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరందరూ యెమన్‌లోని హౌతీ రెబెల్ గ్రూప్‌కు చెందిన వారిగా తెలిసింది.
కౌలాలంపూర్ నగర శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని పత్రాలు పరిశీలించగా.. అవన్నీ నకిలీవని తేలినట్లు పోలీసులు చెప్పారు. డ్రగ్స్ రవాణాతో కూడా వీరికి సంబంధాలున్నాయని తెలిపారు. విచారణలో సౌదీ రాజు సల్మాన్‌పై దాడి చేసేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడించారని ఐజీ ఖలీద్ అబూబకర్ వెల్లడించారు.
నలుగురి వద్ద నుంచి 60 వేల యూఎస్ డాలర్లను స్వాధీనం చేసున్నట్లు తెలిపారు.
హౌతీ రెబెల్ గ్రూప్ అరెస్టుకు ముందు ట్రక్కు బాంబు దాడిని ప్లాన్ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కింగ్ సల్మానే లక్ష్యంగా వీరు కూడా దాడికి కుట్రపన్నినట్లు అబూబకర్ చెప్పారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







