చాక్లెట్‌ అండ్‌ నట్‌ కరంజీ

- March 08, 2017 , by Maagulf
చాక్లెట్‌ అండ్‌ నట్‌ కరంజీ

కావలసినవి: మైదా - ఒకటిన్నర కప్పు, నెయ్యి - 3 టే.స్పూన్లు, నూనె - వేపుడుకు సరిపడా .
 
స్టఫింగ్‌ కోసం: డార్క్‌ చాక్లెట్‌ తరుగు - అరకప్పు, బాదం ముక్కలు - పావు కప్పు, వాల్‌నట్‌ ముక్కలు -పావు కప్పు, తరిగిన పచ్చి కోవా - అర కప్పు, పంచదార - 2 టే.స్పూన్లు.
 
తయారీ: గిన్నెలో మైదా, నెయ్యి, 3 స్పూన్ల చల్లని నీళ్లు పోసి పిండి పిసుక్కుని ముద్ద చేసుకోవాలి. పిండిని సమభాగాలుగా విడదీసి ఉండలు చుట్టి తడి బట్ట కప్పి ఉంచాలి. స్టఫింగ్‌ కోసం కోవా, చక్కెర, వాల్‌నట్స్‌, బాదం ముక్కలు, చాక్లెట్‌ తరుగు.. అన్నీ గిన్నెలో కలుపుకోవాలి. ఈ గిన్నెను 10 నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. పిండి ముద్దను తీసి పూరీలా వత్తుకోవాలి. దీన్లో ఫ్రిజ్‌లో ఉంచి తీసిన మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసేయాలి. ఇలా అన్ని కరంజీలను తయారుచేసుకుని 40 నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత బాండీలో నూనె పోసి వేడయ్యాక ఈ కరంజీలను లేత గోధుమరంగు వచ్చేవరకూ వేయించుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com