కన్నడ సినీ పరిశ్రమలో తెలుగు దర్శకుడి సరికొత్త రికార్డు
- March 08, 2017
భారత సినీ పరిశ్రమలో వంద చిత్రాల వరకు దర్శకత్వం వహించిన వారిని వేళ్లపై లెక్కపెట్టవచ్చు. టాలీవుడ్లో ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ, కోడి రామకృష్ణ, రాఘవేంద్రరావులు ఈ అరుదైన రికార్డును సాధించారు. ఇక కోలీవుడ్లో ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్, రామనారాయణ్లు ఈ ఖ్యాతిని అందుకున్నారు. సాండల్వుడ్లో కూడా ఈ అరుదైన ఖ్యాతిని ప్రముఖ దర్శకుడు సాయిప్రకాశ్ త్వరలో తన సొంతం చేసుకోబోతున్నారు.
కన్నడ సినీ పరిశ్రమలో సెంచరీ చిత్రాల దర్శకత్వం జాబితాలో చోటు సంపాదించుకోబోతున్న సాయిప్రకాశ్ తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. ఆయన దర్శకత్వం వహించిన 98వ చిత్రం 'రియల్ పోలీస్' ఈనెల 10న విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జన్మించిన సాయిప్రకాశ్ హిందూకాలేజీలో విద్యాభ్యాసం చేశారు. బిఎస్సి వరకు చదువుకున్న ఆయనకు చిన్నప్పటి నుంచి నాటకరంగమంటే అమితమైన ఆసక్తి.
ఇదే ఆయనను సినిమారంగంవైపు నడిపించింది. 1971లో చెన్నైకు చేరుకున్న ఆయన 1988లో బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డారు. కన్నడనాట తొలిచిత్రం 'ముత్తినంత మనుష్య' కు దర్శకత్వం వహించారు. అలా నిరాంటకంగా ఆయన సినీపయనం కొనసాగింది.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..