బాలయ్య 101వ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది
- March 09, 2017
100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య క్రేజీ కాంబినేషన్లో మరో చిత్రానికి నేడు శ్రీకారం చుట్టారు. నేడు కూకట్‌పల్లిలోని తులసివనంలో ఉండే వేంకటేశ్వర ఆలయంలో బాలయ్య 101వ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ చేయనున్నడంతో బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు. బాలయ్య సినిమా కోసం ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని భవ్య క్రియేషన్స్ బ్యానర్ అధినేత ఆనంద్ ప్రసాద్ తెలిపారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను, ఎస్.వీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా