ఓ ఇంట్లో దాక్కొన్న ఉగ్రవాదులు, ఆర్మీ కాల్పుల్లో ఒకరు హతం
- March 09, 2017
జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య గురువారం తెల్లవారుజాము నుంచీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. పడ్గంపొరా ప్రాంతంలోని ఓ ఇంట్లో దాక్కొని ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా దళాలు గురువారం ఉదయం ఘటనాస్థలానికి చేరుకుని కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులకు, సిబ్బందికి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇంట్లో ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరు భద్రతా దళాల కాల్పుల్లో హతమైనట్లు తెలిసింది.
గత నాలుగు రోజుల్లో ఈ ప్రాంతంలో ఇది రెండో మేజర్ ఎన్‌కౌంటర్.
పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలో ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాసిబ్బంది హతమార్చారు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు మరణించగా, ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా