ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలపై కఠినమైన చర్యలు
- March 09, 2017
హ్యూమన్ ఫుడ్ కంట్రోల్ రెగ్యులేషన్‌కి సంబంధించిన చట్టంలో కొత్త మార్పుల్ని తీసుకువస్తూ, డ్రాఫ్ట్ చట్టానికి అడ్వయిజరీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. ఇది అమల్లోకి వస్తే తక్కువలో తక్కువ 6 నెలల జైలు శిక్ష నుంచి గరిష్టంగా ఏడాది జైలు శిక్ష ఉల్లంఘనులకు పడుతుంది. అలాగే 7,000 ఖతారీ రియాల్స్ నుంచి 15,000 ఖతారీ రియాల్స్ వరకు జరీమానా కూడా పడుతుంది. ఒకవేళ ఉల్లంఘన రిపీట్ అయితే శిక్ష, జరీమానా డబుల్ అయ్యేలా చట్టంలో మార్పులు చేశారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఉల్లంఘనల్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉన్న నేపథ్యంలో చట్టానికి సవరణలు చేస్తున్నారు. గడువు తీరిన ఆహార పదార్థాలు సేవించిన వ్యక్తి ఒకవేళ పర్మనెంట్ డిజేబులిటీకి గురైతే దోషులపై జైలు శిక్ష 2 ఏళ్ళ దాకా ఉంటుంది, 15,000 నుంచి 30,000 ఖతారీ రియాల్స్ జరీమానా తప్పదు. నిబంధనలకు విరుద్ధంగా ఫుడ్ ప్రోడక్ట్స్‌ని ఇంపోర్ట్ చేసినా, సీజ్ చేసిన ఆహార పదార్థాల్ని అధికారుల అనుమతి లేకుండా తిరిగి వాడేందుకు ప్రయత్నించిరా చర్యలు అతి కఠినంగా ఉండబోతున్నాయి.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా