అక్రమ ప్రకటనలు: 90 రిజిస్ట్రేషన్స్ రద్దు
- March 09, 2017
మనామా: నార్తరన్ ఏరియా మునిసిపాలిటీ 90 కమర్షియల్ రిజిస్ట్రేషన్స్ని గత మూడు నెలల్లో రద్దు చేసింది. అక్రమంగా వీధుల్లో ప్రకటనలు గుప్పిస్తున్నందుకుగాను వాటి రిజిస్ట్రేషన్స్ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. 1310 అక్రమ సైన్ బోర్డ్స్ని గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి తొలగించినట్లు నార్తరన్ ఏరియా మునిసిపాలిటీ జనరల్ డైరెక్టర్ యూసుఫ్ అల్ ఘాతమ్ చెప్పారు. పబ్లిక్ రోడ్లపై ఇష్టమొచ్చినట్లుగా ప్రకటనల్ని పోస్ట్ చేయడం కొందరికి అలవాటుగా మారిపోయిందని, అలాంటివాటికి ఇకపై చెక్ పెడతామని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించే సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తామని ఫొటోలు తీసి, ఆయా సంస్థలకు తాఖీదులు పంపించి, ఆ తర్వాత అవసరమైతే రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామని అధికారులు చెప్పారు. చట్టపరమైన చర్యల విషయంలో ఉపేక్షించేది లేదన్నారు అధికారులు.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







