మలయాళీ ముద్దుగుమ్మ రీఎంట్రీ

- March 09, 2017 , by Maagulf
మలయాళీ ముద్దుగుమ్మ  రీఎంట్రీ

తన అద్భుతమైన నటన, అభినయం, అందంతో అందరి మనసు గెల్చుకున్న నిన్నటితరం నటి వాణి విశ్వనాధ్. మళ్లీ ఇప్పుడు వెండితెరమీద మెరవబోతోంది. 1990 లలో తెలుగు అగ్ర కథానాయకులెందరితోనో ఆడిపాడిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ, దక్షిణాది భాషా చిత్రాలతో పాటు.. హిందీలోనూ నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.

మళ్లీ ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రంలో వాణి విశ్వనాథ్ నటిస్తోంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అమ్మ పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే రమ్యకృష్ణ, మీనా, రోజా, నదియా వంటి తారలు రీఎంట్రీ బ్రహ్మాండంగా సాగిపోతోంది. ఇక వాణి విశ్వనాథ్ ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేసుకుంటుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com