ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి 17 లక్షల జరిమానా
- March 09, 2017
ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తికి అక్కడి జిర్గా (స్థానిక పంచాయతీ) రూ.17 లక్షల జరిమానా వేసింది. ఆ జంటను మూడు నెలలపాటు గ్రామం నుంచి బహిష్కరిస్తూ ఇటీవల హుకుం జారీచేసింది. దక్షిణ సింధ్ ప్రావిన్సులోని కంధ్‌కోట్ కషో్మరే జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
కొన్ని నెలల క్రితం సదరు వ్యక్తి అమ్మాయి ఇష్టంతోనే చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే తమ అమ్మాయిని పెళ్లి చేసుకుని పరువు తీశాడనీ, ఇందుకు జరిమానా కట్టాలని ఆమె పుట్టింటివారు జిర్గాలో ఫిర్యాదు చేశారు. కోర్టుల్లో కేసుల భారాన్ని తగ్గించుకునేందుకు గత నెలలోనే పాక్ ప్రభుత్వం జిర్గాల తీర్పులను చట్టబద్ధం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్పోర్ట్కు పోటెత్తిన ప్రయాణికులు..!!
- కువైట్లో ప్రభుత్వ ఉద్యోగులపై తగ్గిన దాడులు..!!
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం







