మోదీకి సారీ చెప్పిన జియో మరియు పేటిఎం కంపెనీలు
- March 10, 2017 
            ప్రధాని మోదీ ఫొటోని తమ వ్యాపార ప్రకటనల్లో వాడుకున్నందుకు క్షమించాలంటూ రిలయన్స్ జియో, పేటీఎం అభ్యర్థించాయి. సదరు విషయంపై రిలయన్స్ జియో, పేటీఎంలు క్షమాపణ చెప్పినట్టు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. రిలయన్స్ జియో మోదీ ఫొటోతో వివిధ పత్రికల్లో ఒక ఫుల్ పేజ్ వ్యాపార ప్రకటనను గత నెల సెప్టెంబర్ లో ఇచ్చింది. అలాగే పేటీఎం కూడా రెండు నెలల తర్వాత మోదీ డీమానిటైజేషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమ డిజిటల్ వాలెట్‌ను వినియోగించాలని పత్రికల్లో అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చింది. ఈ వ్యాపార ప్రకటనలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై పలు కోర్టులలో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా నమోదయ్యాయి. దీంతో మోదీ ఫోటోగ్రాఫ్ లను తమ అడ్వర్ టైజ్ మెంట్లలో వాడుకున్నందుకు ప్రభుత్వం గత నెల ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేసింది.
తాజా వార్తలు
- Women’s World Cup 2025: ఫైనల్ చేరిన భారత్
- ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: సీఎం చంద్రబాబు
- 2,790 మంది భారతీయులను US వెనక్కి పంపింది: కేంద్రం
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు ఇక ఇ-పాస్‌పోర్టులే..!!
- ఉమ్రా వీసా వ్యాలిడిటీని తగ్గించిన సౌదీ అరేబియా..!!
- దోఫర్ మునిసిపాలిటీలో విస్తృతంగా తనిఖీలు..!!
- అల్-జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ 9న రీ ఓపెన్..!!
- మీ ID, మీ గోప్యత.. బహ్రెయిన్ లో డెలివరీలకు న్యూ గైడ్ లైన్స్..!!
- ఖతార్ లో నవంబర్ 4న రిమోట్ క్లాసెస్..!!
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్







