ఊచకోతకు పాల్పడుతున్నటర్కీ సైన్యం

- March 10, 2017 , by Maagulf
ఊచకోతకు పాల్పడుతున్నటర్కీ సైన్యం

- కుర్దు ప్రాబల్య ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన 
 కుర్దులు నివసిస్తున్న ప్రాంతాల్లో టర్కీ సైనిక బలగాలు చేపడుతున్న ఆపరేషన్ల వల్ల వేలాది మంది అమాయకులు చనిపోయారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. కుర్దిస్తాన్‌ వర్కర్స్‌ పార్టీని దెబ్బతీయటానికి టర్కీ సైన్యం దారుణ చర్యలకు తెగబడుతున్నదని, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, గత 18 నెలల కాలంలో 2 వేల మంది అమాయక పౌరులు చనిపోయారని ఐరాస విచారణ ఏజెన్సీలు తాజాగా ఓ నివేదికను విడుదల చేశాయి. ఈ నివేదికలోని అంశాలు ఇలా ఉన్నాయి...

ఆగేయ టర్కీలో కుర్దుల ప్రాబల్యమెక్కువ. ఇక్కడ టర్కీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తున్నది. కుర్దులకు ప్రత్యేకంగా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్‌. దీనికోసం కుర్దిస్తాన్‌ వర్కర్స్‌ పార్టీ (పీకేకే) పనిచేస్తున్నది. పీకేకేను దెబ్బతీయటం కోసం పెద్ద ఎత్తున కిడ్నాపింగ్‌లు, హత్యలు, వేధింపులకు టర్కీ సైన్యం పాల్పడుతున్నది. వేలాది మంది కుర్దుల్ని చంపుతున్నారని, జైళ్లలో బంధిస్తున్నారని...ఈ అణిచివేత వాతావరణాన్ని తట్టుకోలేక 3-5 లక్షల మంది కుర్దులు వలసలు వెళ్లాల్సి వచ్చిందని (జులై 2015-డిసెంబర్‌ 2016 మధ్య) ఐరాస తన నివేదికలో తెలిపింది. కుర్దు ప్రాబల్య ప్రాంతాల శాటిలైట్‌ చిత్రాలను పరిశీలిస్తే... అక్కడి ప్రజల నివాసాల్ని టర్కీ బలగాలు ధ్వంసం చేశాయి. ఇంత జరుగు తున్నా... ఎన్నో సంస్థలు ఆరోపిస్తున్నా టర్కీ ప్రభు త్వం ఎలాంటి విచారణ జరిపిం చటం లేదు. అధ్యక్షుడు ఎర్డోగన్‌ కూడా స్పందించటం లేదు. పీకేకే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నదంటూ కుర్దు ప్రాబల్య ప్రాంతాలకు ఎవర్నీ అనుమతించటం లేదు. స్వతంత్ర సంస్థల పర్యటనల్ని అడ్డుకుంటున్నది. 
''టర్కీలోని కుర్దు ప్రాబల్యమున్న ప్రాంతంలోని నగరం సిజ్రె. ఈ నగరంలోని ఒక వ్యక్తికి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆఫీస్‌ నుంచి పిడుగులాంటి వార్త ఒకటి వచ్చింది. అదేంటంటే...'మీ చెల్లెల్ని ఎవరో హత్య చేశారు. శవాన్ని తీసుకెళ్లండి'..అని. ఆ యువకుడు, కుటుంబ సభ్యులంతా ప్రాసిక్యూటర్‌ కార్యాలయానికి వెళితే... చనిపోయిన చెల్లెలి శరీర భాగాల్ని (చిన్న చిన్న ముక్కల్ని) అందజేశారు. ఆమె ఎలా చనిపోయింది..ఎవరు చంపారు వంటి కారణాలేమీ చెప్పకుండా బాధిత కుటుంబసభ్యులకు శవాన్ని అందించారు. ఎవరు ఎప్పుడు కిడ్నాప్‌ అవుతారో... హత్యకు గురవుతారో తెలియని పరిస్థితి టర్కీలోని కుర్దులు నివసిస్తున్న ప్రాంతంలో నెలకొంది'' 
- ఐరాస నివేదిక

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com