227 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అరెస్ట్
- March 10, 2017
దుబాయ్ పోలీస్ 2016 సంవత్సరంలో మొత్తం 227 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే పలు కేసుల్లో 'వాంటెడ్' లిస్ట్‌లో ఉన్న 13,000 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సౌరీ (దుబాయ్ పోలీస్ డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్) మాట్లాడుతూ, 2015తో పోల్చితే 2016లో పెరుగుదల 13 శాతం ఉన్నట్లు చెప్పారు. నిందితులు, 5.1 బిలియన్ దిర్హామ్‌ల విలువైన ఫైనాన్షియల్ క్రైమ్స్‌కి పాల్పడ్డారని చెప్పారాయన. ఇంటర్‌పోల్ సహకారంతో అరెస్టయినవారు 1.3 బిలియన్ దిర్హామ్‌ల విలువైన నేరాలకు పాల్పడ్డారు. ఇంటర్‌పోల్ ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్‌ని 178 మంది నిందితులకు జారీ చేసింది. ఇతర దేశాల నుంచి అందిన వారెంట్స్ నేపథ్యంలో ఎగ్జిక్యూట్ చేయబడ్డ క్రైమ్స్ శాతం 97.1 శాతం ఉంది. ఇంటర్నేషనల్లీ వాంటెడ్ అరబ్ సస్పెక్ట్ అయిన ఓ వ్యక్తిని 89 ఫైనాన్స్ కేసులకు సంబంధించి ఎక్స్‌ట్రాడిక్ట్ చేయడం జరిగిందని దుబాయ్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. పలు దేశాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు ఆ వ్యక్తి.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







