సోలార్ పవర్ అపార్టు మెంట్లకు

- March 10, 2017 , by Maagulf
సోలార్ పవర్ అపార్టు మెంట్లకు

టెక్నాలజీని వినియోగించుకుంటూ సోలార్ విద్యుత్‌ను వినియోగించుకునేందుకు ప్రభుత్ం ప్రోత్సాహం అందిస్తోంది.  తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 17 లక్షల విద్యుత్ కనెక్షన్లు వున్నాయి. రోజుకు 11.25 నుంచి 11.50 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరుగుతోంది.  సోలార్ విద్యుత్తు వినియోగం పెరిగితే గణనీయంగా విద్యుత్‌ను ఆదా చేసే పరిస్థతి వస్తుందని అంచనా వేస్తున్నారు.  ఈ వేరకు జిల్లాలో ఇటు గృహ వినియోగంతో పాటు వ్యవసాయ రంగంలో కూడా విరివిగా సోలార్ విద్యుత్తును వినియోగించేలా చర్యలు చేపట్టారు.    జిల్లాలో ఇళ్ళకు కూడా సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు.  ఒక్కో ఇంటి రూప్‌టాప్‌కు 5 కిలో వాట్ల సోలార్ విద్యుత్ యూనిట్లను రూ.85 వేలకు అందిస్తున్నారు.  5 హెచ్‌పి సోలార్ పంపుసెట్లు రూ.4.95 లక్షలు యూనిట్ ఖరీదులో అందిస్తున్నారు.  ఇందులో రూ.55 వేలు లబ్ధిదారుడు భరించాల్సి వుంది.  మిగిలింది ప్రభుత్వాలు సబ్సీడీగా అందిస్తాయి.  అదే విధంగా 3 హెచ్‌పి సోలార్ యూనిట్‌ను రూ.3.20 లక్షలకు అందిస్తున్నారు.  ఇందులో 11 శాతం సబ్సీడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. సోలార్ పంపు సెట్ల వల్ల రాత్రి పూట విద్యుత్ వినియోగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com