బిర్యానీలో గాజుముక్క
- September 24, 2015
భారతదేశంలోని కొచ్చి నుంచి అబుదాబీ ప్రయాణిస్తున్న సమయంలో ఎనిమిదేళ్ళ చిన్నారికి అందించిన బిర్యానీలో గాజు ముక్క కనిపించడం చర్చనీయాంశమయ్యింది. తన కుమార్తెకు విమాన సిబ్బంది అందించిన బిర్యానీలో గాజు ముక్క చూసి తమ కుటుంబం ఆశ్చర్యపోయిందని అబుదాబీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సునీల్ మదంపిల్ చెప్పారు. అదృష్టవశాత్తూ తన కుమార్తె ఆ గాజు ముక్కను గుర్తించిందనీ, ఒకవేళ చూసుకోకుండా ఆమె నోట్లోకి ఆ గాజుముక్క వెళ్ళిపోయి వుంటే ప్రమాదం సంభవించేదని సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ గాజు ముక్కకు సంబంధించిన ఫొటో తీసి, జరిగిన విషయాన్ని క్యాబిన్ క్రూకి వివరించినట్లు చెప్పారు సునీల్. ఈ ఘటనపై తాను ఇండియా ఎక్స్ఎస్ అధికారులకు ఫిర్యాదు చేశాననీ, లిఖిత పూర్వకంగా ఫిర్యాదును ఇవ్వమని చెప్పారనీ, తాను వారు చెప్పినట్లే చేశాననీ, దీనిపై సింపుల్‌గా సారీ చెప్పి ఊరుకున్నారన్నారు సునీల్.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









