భళా మోడీ భళా!
- March 11, 2017
మళ్లీ మోడీ జపం పని చేసింది. ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేష్, ఉత్తరాంఖడ్, మణిపూర్, పంజాబ్, గోవా) ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్లింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో అత్యథిక బీజేపీ అత్యథిక స్థానాలు గెలుచుకోవడం విశేషం. ఈ ఉదయం నుంచి కొనసాగుతోన్న కౌంటింగ్ ముగిసింది. ఫైనల్ రిపోర్ట్ వచ్చేసింది.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రంభంజనం సృష్టించింది. యూపీలో 403 స్థానాలకు గానూ.. బీజేపీ ఏకంగా 324 స్థానాలను కైవసం చేసుకొని విజయ దుందుబి మోగించింది. ఎస్సీ-కాంగ్రెస్ 54, బీఎస్పీ 19, ఇతరులు 5 స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఉత్తరాఖండ్‌లోనూ 60 అసెంబ్లి స్థానాలకు గాను, బీజేపీ 56 స్థానాల్లో గెలుపొంది విజయకేతనం ఎగురవేసింది.
ఇక్కడ కాంగ్రెస్ 11, ఇతరులు 2 స్థానాల్లో గెలువగా, బీఎస్పీ ఖాతా తెరవలేకపోయింది.
పంజాబ్ మాత్రం కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 77, ఆమ్ ఆద్మీ పార్టీ 2, శిరోమీ అకాళీదల్-బీజేపీ 18, ఇతరులు 2 స్థానాలను కైవసం చేసుకున్నారు.
ఇక, మణిపూర్, గోవాలో ఏ పార్టీ స్పష్టమైన మేజార్టీని చూపలేకపోయింది. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో కాంగ్రెస్ 25, బీజేపీ 21, ఇతరులు 11 స్థానాలను కైవసం చేసుకున్నారు. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 19, బీజేపీ 14, ఎంజీపీ కూటమి 3, ఇతరులు 4 స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో.. ఈ రెండు రాష్ట్రాల్లో పొత్తులు-జిత్తులకి తెరలేచింది.
మొత్తంగా.. 2019 ఎన్నికలకి సెమీ ఫైనల్ గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజేతగా నిలిచింది. 2019లో మరోసారి అధికారం మనదేన్న ధీమాని పార్టీ శ్రేణులకి కలిగించింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







