ప్రౌన్‌ మలై కర్రీ

- March 11, 2017 , by Maagulf
ప్రౌన్‌ మలై కర్రీ

కావలసినవి: రొయ్యలు- 500గ్రా., కొబ్బరి పాలు - రెండు కప్పులు, పెద్ద ఉల్లిపాయ (మందంగా తరిగినది) - ఒకటి , మరో ఒక పెద్ద ఉల్లిపాయముద్ద మెత్తగా రుబ్బినది, అల్లం ముద్ద ఒక టీ స్పూన్‌, ఒకటిన్నర టీ స్పూన్‌ కారం, అర టీ స్పూను పసుపు, బిరంజి ఆకులు రెండు, లవంగాలు నాలుగు, యాలకులు మూడు, దాల్చిన చెక్క ఒకటి, ఒకటిన్నర టీ స్పూను పంచదార, రెండు టేబుల్‌ స్పూనులు నెయ్యి, పచ్చి మిరపకాయలు మూడు లేక నాలుగు(ముక్కలుగా తరిగినది) గుప్పెడు కొత్తిమీర తరిగినది అలంకరణ కోసం... ఉప్పు తగినంత.
తయారీ విధానం:
మందపాటి గిన్నెలో నెయ్యిని వేడి చేసి బిరంజి ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి అరనిమిషం వేగించండి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో అల్లం ముద్ద, కారం, పసుపు వేసి తిప్పండి. నెయ్యి పైకి తేలిన తరువాత అందులో రొయ్యలు వేసి రెండు నిమిషాలపాటు వేగించండి. తర్వాత కొబ్బరిపాలు, పంచదార, ఉప వేసి బాగా ఉడికించండి. రొయ్యలు ఉడికాయని అనిపించిన తరువాత మూత పెట్టి సన్నని సెగ మీద పది నిమిషాలు ఉంచండి. కొత్తిమీర, పచ్చిమిరపముక్కలతో అలంకరించి వేడి వేడి అన్నంతో తింటే ప్రాన్‌ మలై కర్రీ చాలా రుచిగా ఉంటుంది.కావలసినవి: రొయ్యలు- 500గ్రా., కొబ్బరి పాలు - రెండు కప్పులు, పెద్ద ఉల్లిపాయ (మందంగా తరిగినది) - ఒకటి , మరో ఒక పెద్ద ఉల్లిపాయముద్ద మెత్తగా రుబ్బినది, అల్లం ముద్ద ఒక టీ స్పూన్‌, ఒకటిన్నర టీ స్పూన్‌ కారం, అర టీ స్పూను పసుపు, బిరంజి ఆకులు రెండు, లవంగాలు నాలుగు, యాలకులు మూడు, దాల్చిన చెక్క ఒకటి, ఒకటిన్నర టీ స్పూను పంచదార, రెండు టేబుల్‌ స్పూనులు నెయ్యి, పచ్చి మిరపకాయలు మూడు లేక నాలుగు(ముక్కలుగా తరిగినది) గుప్పెడు కొత్తిమీర తరిగినది అలంకరణ కోసం... ఉప్పు తగినంత.
తయారీ విధానం:
మందపాటి గిన్నెలో నెయ్యిని వేడి చేసి బిరంజి ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి అరనిమిషం వేగించండి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో అల్లం ముద్ద, కారం, పసుపు వేసి తిప్పండి. నెయ్యి పైకి తేలిన తరువాత అందులో రొయ్యలు వేసి రెండు నిమిషాలపాటు వేగించండి. తర్వాత కొబ్బరిపాలు, పంచదార, ఉప వేసి బాగా ఉడికించండి. రొయ్యలు ఉడికాయని అనిపించిన తరువాత మూత పెట్టి సన్నని సెగ మీద పది నిమిషాలు ఉంచండి. కొత్తిమీర, పచ్చిమిరపముక్కలతో అలంకరించి వేడి వేడి అన్నంతో తింటే ప్రాన్‌ మలై కర్రీ చాలా రుచిగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com