భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్న చైనా
- March 12, 2017
చంద్రుడి మీద కాలుమోపడం కోసం, వివిధ అంతరిక్ష పరిశోధనల కోసం కొత్తగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్స్టేషన్) నిర్మించబోతున్నట్టు చైనా ప్రకటించింది. భూమి నుంచి తక్కువ ఎత్తు లోని కక్షలో దీనిని నిర్మించనున్నారని, చంద్రుడిపైకి రాకపోకలను ఉద్దేశించి ఈ ప్రాజెక్టు చేపట్టామని,ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 5 ఏండ్లలో పూర్తిచేయాలన్నది లక్ష్యమని చైనా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న 'సైన్స్ అండ్ టెక్నాలజీ' డెయిలీ న్యూస్ వార్తల్ని ప్రచురిం చింది.కొత్తగా నిర్మించ బోతున్న స్పేస్స్టేషన్ కు ఇంకా పేరు పెట్టలేదు. పెద్ద సంఖ్యలో వ్యోమగాము లు ఉండటానికి స్పేస్స్టేషన్ లో ఓ గది కూడా ఉం టుందని ప్రాజెక్టు ఇంజనీర్ జాంగ్ బెనైన్ చెప్పారు.
ప్రస్తుతం అంతరిక్షంలో 'షెంజో' అనే స్పేస్స్టేషన్ పనిచేస్తున్నది. రష్యాకు చెందిన సూయజ్ తరహాలో దీనిని డిజైన్ చేశారు. అయితే 'షెంజో'లో కేవలం ముగ్గురు వ్యోమగాములు మాత్రమే ఉండటానికి వీలు ఉంది. 2003 నుంచి 'షెంజో' పూర్తిస్థాయిలో పనిచేయటం ఆరంభిం చింది.
ఈ తరహాలోనే మరోటి పెద్దదైన అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చైనా నిర్ణయించుకుంది. దీని ద్వారా ముందు ముందు చంద్రుడి మీదకు ప్రయాణాలు చేయాలన్నది ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
తాజా వార్తలు
- ఢిల్లీలో భారీ పేలుడు..8 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు







