వాట్సాప్ ద్వారా మోసపూరిత సందేశాలను వ్యతిరేకంగా మంత్రిత్వ శాఖ హెచ్చరిక

- March 12, 2017 , by Maagulf
వాట్సాప్ ద్వారా  మోసపూరిత సందేశాలను వ్యతిరేకంగా మంత్రిత్వ శాఖ హెచ్చరిక

వాట్సాప్ మరియు ఇతర సోషల్ నెట్వర్కింగ్ వేదికల ద్వారా వచ్చే మోసపూరిత సందేశాలకు ప్రజలు    స్పందించకుండా వాటికి వ్యతిరేకంగా ఉండాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించారు. కాలర్లు మరియు సందేశం పంపినవారు మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్ధాల కొనుగోలు మరియు డబ్బు బదిలీ తదితర లావాదేవీలను ప్రచారం చేస్తున్నాయి.ఈ తరహా సందేశాలు అంతర్జాతీయ ఫోన్ నంబర్ల నుండి సంఖ్యలు, పాకిస్తాన్ తదితర దేశాల నుండి కొందరు స్థానికులకు సందేశాలను వస్తున్నట్లు మంత్రిత్వశాఖ గమనించిందని తెలిపారు. వీటిలో కొన్ని తెలియని మూలాల నుండి స్థానికులకు  వాట్స్ అప్  ద్వారా యాదృచ్ఛిక కాల్స్ మరియు సందేశాలను రావడం ఇటీవల తాము గమనించినట్లు హెచ్చరిక జారీ చేసింది.మంత్రిత్వశాఖలోని మాధకద్రవ్యాల వ్యతిరేక ఫెడరల్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ కల్నల్ సయీద్ అల్ సువాడి   తాము ఈ తరహా సందేశాల పట్ల నియంత్రణ చేసి నిఘా వేయగా పాకిస్తాన్ లో కౌంటర్ భద్రతా సేవల సహకారంతో ఆ సందేశాలను పంపినవారు గుర్తించడానికి  ఏర్పాట్లు చేశామన్నారు. వాట్స్ అప్  మోసం చేసే  సందేశాలను మాదక ద్రవ్యాలు, అసభ్యకర చిత్రాలు మరియు డబ్బు మార్పిడి చేయమని సందేశాలు పలువురికి వెల్లువెత్తుతున్నాయి. అనుమానాస్పద కాల్స్ మరియు హానికరమైన సందేశాలు ఇతరుల డబ్బు మోసపుచ్చు ఫోన్ కాల్స్ వచ్చినపుడు 80044 ఫోన్ చేయాలని అలాగే అనుమానాస్పద నెంబర్లతో అక్రమ కార్యకలాపాలపై ఏమైనా సమాచారం ఉంటె తమకు వెంటనే తెలియచేయాలని   కల్నల్ అల్ సువాడి కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com