తారల మధ్య భారత్ ఠాకూర్ చిత్ర కళా ప్రదర్శన

- March 12, 2017 , by Maagulf

హైదరాబాద్ లోని బంజారా హిల్స్  రోడ్ ఏ 12, లోటస్ పాండ్ సమీపంలోని గ్యాలరీ స్పేస్ వద్ద శనివారం సాయంత్రం దుబాయ్ కు చెందిన ప్రముఖ యోగా గురు భరత్ ఠాకూర్ స్వీయ చిత్రీకరణలను 'కలోసల్ అబ్స్ట్రాక్ట్' పేరున ఘనంగా ప్రారంభించారు. గత సంవత్సరం బెంగుళూర్ ఆర్ట్ గ్యాలరీ సోలో ప్రదర్శన నిర్వహించగా ఈ ఏడాది మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో నిర్వహించటం విశేషం. ప్రముఖ సినీ స్టార్ నాగార్జున అక్కినేని లాంఛనంగా  ప్రారంభించారు మరియు సినీ పరిశ్రమ నుండి జగపతి బాబు,సిరాశ్రీ మరియు పలువురు తారలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కళాకారులు రూపొందించిన అపురూప  కళాఖండాలు తిలకించి ఆనందించండని ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా వ్యవరహించిన  ప్రముఖ సంస్థ ఆర్.కె మీడియా యొక్క ఛైర్మన్ రవి పనస ఆహ్వానించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com