వెజ్ స్పానిష్‌ రైస్‌

- March 12, 2017 , by Maagulf
వెజ్ స్పానిష్‌ రైస్‌

కావలసిన పదార్థాలు : బాస్మతి బియ్యం-ఒకటిన్నర కప్పు, టమాటా-3, కాప్సికమ్‌-2 క్యారెట్‌-100గ్రా, బీన్స్‌-100గ్రా, పచ్చి బఠాణీలు-50గ్రా, బంగాళదుంపలు-2, ఉల్లిపాయ-1, ఛీజ్‌ తురుము-100గ్రా, పచ్చిమిర్చి పేస్ట్‌-2 స్పూన్లు, వెన్న-1 స్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు-12, ఎండు మిరపకాయలు-4, పెరుగు-1 కప్పు, నెయ్యి-2 స్పూన్లు, గరం మసాలా-1 స్పూన్‌, మిరియాల పొడి-1 స్పూన్‌, జీడిపప్పు-50గ్రా, ఉప్పు-తగినంత. 

తయారుచేసే విధానం : బాస్మతి బియ్యాన్ని ముందుగానే ఉడికించి పక్కన ఉంచుకోవాలి. కూరగాయలన్నిటినీ ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి పేస్ట్‌ చేసి పెట్టుకోవాలి. బాణలి స్టవ్‌పై ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి, తర్వాత ఎండు మిరపకాయలు-వెల్లుల్లి ముద్ద కూడా వేసి మూడు నిమిషాలు వేగించాలి. ఇందులో పెరుగు, కూరగాయ ముక్కలు, గరం మసాలా, పచ్చిమిర్చి పేస్ట్‌, ఉప్పు వేసి మరి కొంత సేపు వేగించాలి. తర్వాత వెన్న చేర్చి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచాలి. ఆఖర్న ఉడికించి పెట్టుకున్న బాస్మతి అన్నం, ఛీజ్‌ తురుము వేసి 15-20 నిమిషాలు ఉడికించాలి. దించే ముందు పైన జీడిపప్పు చల్లాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com