భారతీయ సంతతి ఫెడరల్ ప్రాసిక్యూటర్ ప్రీత్ భారార తొలగింపు
- March 12, 2017
అమెరికా అత్యున్నత స్థాయి ఫెడరల్ ప్రాసిక్యూటర్ ఒకరిని ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. భారతీయ సంతతికి చెందిన ప్రీత్ భారారను బలవంతంగా తొలగించింది. 'నేను రాజీనామా చేయలేదు. నాకు ఎటువంటి సమాచారం అందజేయకుండానే తొలగించారు' అని ప్రీత్ ట్వీటర్లో తెలిపారు. అమెరికా అటార్నీగా పనిచేయడాన్ని నేను గౌరవంగా భావిస్తాను అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ట్రంప్‌ను కలిసి తాను పోస్టులో కొనసాగుతానని తెలిపారు. అప్పట్లో ఆయన దీనికి అంగీకరించినట్టు కూడా చెప్పారు. కానీ బరాక్ ఒబామా నియమించిన ప్రాసిక్యూటర్లను శుక్రవారం ట్రంప్ సర్కారు తొలగించింది. మూకుమ్మడిగా ప్రాసిక్యూటర్లను తొలగించడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి.
ప్రీత్ వాల్‌స్ట్రీట్ బ్యాంకర్లకు వ్యతిరేకంగా కేసును గెలిచారు. ఎస్ఏసీ క్యాపిటల్ అడ్వైజర్స్ 1.8బిలియన్ డాలర్ల ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో విజయం సాధించారు. ఆయన గతంలో రిపబ్లికన్లు, డెమక్రాట్ల చట్టసభ సభ్యులను కూడా ప్రాసిక్యూట్ చేశారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







