పాకిస్తాన్ స్కూల్ విద్యార్ధులు లతా పాటను రోజూ ఆలపించే

- March 13, 2017 , by Maagulf
పాకిస్తాన్ స్కూల్ విద్యార్ధులు లతా పాటను రోజూ ఆలపించే

మన దేశం అంటే పాక్ విపరీతమైన ద్వేషం కురిపిస్తుంది.. కానీ ఆ ద్వేషం పాలకులకే గానీ ప్రజలకు లేదు అని మరో సారి రుజువైంది.. ఓ బాలీవుడ్ సినిమా పాట కు అరుదైన గౌరవం దక్కింది.. ఓ పాఠశాలలో ఆ పాటను రోజూ విద్యార్ధులతో పాడిస్తున్నారు.. అంతకంటే ఓ సినిమాకు కావలసిన గౌరవం ఏముంటుంది.. ? అదీ కూడా ఆ పాఠశాల పాకిస్తాన్ లో ఉందంటే అంతకంటే విశేషం ఏముంది? ఆ గౌరవం దక్కించుకొన్న పాట.. "దో ఆంఖే బరహ్ హాథ్" చిత్రంలో లతామంగేష్కర్ పాడిన 'యే మాలిక్‌ తేరే బందే హమ్‌...' పాట..  1957 లో వచ్చిన ఈ పాట అప్పటి ప్రేక్షకుల హృదయాల్లో మరపురాని గీతంగా నిలిచిపోయింది.. ఈ పాట లోని భావం నచ్చిన ఓ పాకిస్తానీ పాఠశాల నిర్వహకులకు ఆ పాటలోని భావం నచ్చి తమ పాఠశాల గీతంగా స్వీకరించి రోజూ విద్యార్ధులతో పాడిస్తున్నారు.. కాగా ‘దో ఆంఖే బారహ్‌ హాథ్‌’ చిత్రం ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచిపోయింది. బెర్లిన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవంలో సిల్వర్‌ బేర్‌ పురస్కారం తో పాటు.. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) అవార్డ్స్ ను గెలుచుకొన్నది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com